Monday, January 20, 2025

లగ్జరీ కారులో వచ్చి మేకను ఎత్తుకెళ్లారు….

- Advertisement -
- Advertisement -

 

లక్నో: ఇంటి ముందు కట్టేసిన మేకను లగ్జరీ కారులో వచ్చి ఎత్తుకెళ్లిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కసారి మసారి గ్రామంలో మన్సూర్ అలమ్ అనే వ్యక్తి తన ఇంటి ముందు మేకను కట్టేసుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు హోండా సిటీ కారులో మన్సూర్ ఇంటి ముందు ఆపారు. అనంతరం ఇద్దరు వ్యక్తులు కారులో నుంచి దిగి మేకను తీసుకెళ్లారు. కారును గ్రామస్థులు వెంబడించినప్పటికి వాహనం వేగంగా వెళ్లడంతో పట్టుకోలేకపోయారు. వెంటనే మన్సూర్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ధుమన్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేకను ఎత్తుకెళ్లిన సంఘటన స్థానిక కెమెరాలో రికార్డు కావడంతో అది వైరల్‌గా మారింది. ఈద్ ఉల్ అజా కోసం మేకను తీసుకున్నామని, మేక ఖరీదు పది వేల రూపాయల వరకు ఉంటుందని యజమాని తెలిపారు.

Also Read: చెత్త ఆటతో పరువు తీశారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News