Monday, December 23, 2024

అలహాబాద్ మ్యూజియంనుంచి ఢిల్లీ చేరుకున్న రాజదండం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా చోళుల కాలం నాటి ఓ పురాతన ఆచారానికి తిరిగి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది.అధికార బదిలీకి ప్రతీకగా శతాబ్దాల తరబడి చోళ రాజులు తమ వారసుని చేతికందిస్తూ వచ్చిన రాజదండం(సెంగోల్)ను లోక్‌సభలో పునః ప్రతిష్ఠించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.సెంగోల్‌గా పిలవబడే ఈ రాజదండం నీతీ నియమాలను పాటిస్తూ ధర్మబద్ధంగా పాలన సాగిస్తామని చెప్పేందుకు ప్రతీక.

1947 ఆగస్టు 14న జరిగిన అధికార బదిలీ సమయంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు లాంఛనంగా అప్పగించిన ఈ రాజదండం అప్పటినుంచి అలహాబాద్ మ్యూజియంలోని నెహ్రూ గ్యాలరీలో ఉంచారు. పార్లమెంటు భవనం ్రప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ రాజదండాన్ని తమిళనాడుకు చెందిన అధీనంనుంచి స్వీకరించిన అనంతరం లోక్‌సభలో స్పీకర్ స్థానం సమీపంలో ప్రతిష్ఠిస్తారని అమిత్ షా చెప్పారు. ఇందుకోసం ఈ రాజదండాన్ని ఇప్పటికే అలహాబాద్ మ్యూజియంనుంచి ఢిల్లీకి తరలించారు కూడా.

నాటి సెంగోల్ తయారీలో పాలు పంచుకున్న వుమ్మిడి యతిరాజులు(96), వుమ్మిడి సుధాకర్(86)లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అంతేకాకుండా పార్లమెంటు భవన నిర్మాణంలో పాలు పంచుకొన్న దాదాపు 60 వేల మంది కార్మికులను కూడా ఈ సందర్భంగా ప్రధాని సత్కరిస్తారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News