Friday, December 27, 2024

మణిపూర్‌లో శాంతి కోసం చర్చిలో ప్రార్థనలు

- Advertisement -
- Advertisement -

కొత్తకోట: గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింసా ఖాండను తీవ్రంగా నిరసిస్తూ ఆ రాష్ట్రంలో శాంతి కోసం క్రైస్తవ సామాజిక పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తకోట చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొన్న వారు మాట్లాడుతూ మణిపూర్‌లో జరుగుతున్న అమానవీయ ఘటనలు కలిచివేస్తున్నాయని, యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయమన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే హింసకు పాల్పడే వారిపై ఉక్కు పాదంతో అణిచివేసి మణిపూర్ రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలని వారు కోరారు. కొత్తకోటలో జరిగిన ఈ కార్యక్రమంలో కెఎస్‌పివి రాష్ట్ర అధ్యక్షులు జనంపల్లి షమి యాసోన్, పాస్టర్లు వై. నాతానియల్, ఎన్. సుందర్, ఆశీర్వాదం, దావీదు, లాజర్, జాన్ మార్క్, చంద్రబాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బి. సంజీవయ్య, నాయకులు జెడి శాంతి ప్రసాద్, జెపి పాల్, విలియం బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News