Monday, January 20, 2025

ఎన్నికల్లోగా పిఆర్‌సి బకాయిలు

- Advertisement -
- Advertisement -

టీచింగ్ హాస్పిటల్స్ వైద్యులకు మంత్రి హరీశ్‌రావు అభయం
త్వరలోనే ప్రొఫెసర్ల బదిలీలు చేపడతామని హామీ

మనతెలంగాణ/హైదరాబాద్ : టీచింగ్ హాస్పిటల్ వైద్యుల 2016 పిఆర్‌సి బకాయిలు ఎన్నికల కంటే ముందుగానే ఇస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వైద్యులకు హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల బదిలీలు త్వరలోనే చేపడతామని అన్నారు. తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టిటిజిడిఎ) ప్రతినిధులతో శుక్రవారం ప్రగతిభవన్‌లో మంత్రి హరీశ్‌రావు చర్చలు జరిపారు. దాదాపు అరగంటకుపైగా డియంఇ డాక్టర్ల డిమాండ్లు ఒకటి తరువాత ఒకటి అన్ని చర్చించినట్లు టిటిజిడిఎ ప్రతినిధులు తెలిపారు. టీచింగ్ హాస్పిటల్స్ వైద్యుల అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని మంత్రి చెప్పారని అన్నారు. తమ సమస్యలపై వెంటనే స్పందించి, చర్చలకు పిలిచి సమస్యల సానుకూలంగా స్పందించిన మంత్రి టి.హరీష్ రావుకు టిటిజిడిఎ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్ అన్వర్, డాక్టర్ జలగం తిరుపతి రావు, ఉపాద్యక్షులు కిరణ్ మాదల, కోశాధికారి కిరణ్ ప్రకాష్‌లు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News