Friday, November 22, 2024

విద్యుత్ ఉద్యోగులకు త్వరలో పీఆర్‌సి:మంత్రి జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులకు త్వరలో పిఆర్‌సిని ప్రకటిస్తామని, త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడి వారం రోజుల్లో పిఆర్‌సిపై ప్రకటన చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి వెల్లడించారు. తమకు పిఆర్‌సిని ప్రకటించాలని కోరుతూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఈఈ జేఏసి ) ఈ మేరకు మింట్ కాంపౌండ్‌లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని, అలాగే ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి డి. ప్రభాకర్ రావును, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డిని శనివారం నాడు కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ మేరకు మింట్ కాంపౌండ్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వారు మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసి తమకు పిఆర్‌సిని ప్రకటించాలని, ఇప్పటికే ఆలస్యం అయిందని కోరారు.

అలాగే ఈపిఎఫ్ నుండి జిపిఎఫ్ ఇవ్వాలని కోరారు. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు. ఓ వారం రోజుల్లోనే పిఆర్‌సిపై ప్రకటన చేస్తామని జెఏసి నాయకులకు తెలిపారు. మంత్రి పిఆర్‌సిపై సానుకూలంగా స్పందించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ సిఎం కెసిఆర్‌కు, మంత్రి జగదీశ్ రెడ్డి, సిఎండిలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసి ఛైర్మెన్ కే. ప్రకాశ్, కన్వీనర్ ఎన్. శివాజీ, వైస్ ఛైర్మన్ పి.అంజయ్య, జేఏసి నాయకులు నాసర్ షరీఫ్, మాతంగి శ్రీనివాస్, గణేశ్, జాన్సన్, రామేశ్వర శెట్టి , ఆరోగ్య రాణి, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News