Tuesday, November 5, 2024

జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అమలు

- Advertisement -
- Advertisement -

PRC implementation for water board employees

పీఆర్సీ అమలుతో జలమండలి ఉద్యోగుల సంబరాలు
ఉద్యోగులపై సిఎం కెసిఆర్ ప్రత్యేక ప్రేమ చూపారన్న వాటర్‌వర్క్ ఎంప్లాయిస్ యూనియన్

హైదరాబాద్: జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. జీవో నెం. 51 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న పీఆర్సీనే యథాతదంగా జలమండలి ఉద్యోగులకు కూడా వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 2018 నుంచి ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జలమండలి ఉద్యోగులకు జూన్ 2021 నుంచి పిఆర్సీ బకాయిలు కూడా నగదు ద్వారా అందనున్నాయి. పీఆర్సీ 2020 అమలు ద్వారా జలమండలి ప్రతి నెల రూ. 12 కోట్లు అదనంగా జీతభత్యాల కింద చెల్లించాల్సిన ఉంటుంది. ఉద్యోగులకు వారు తీసుకునే జీతం దాదాపు రూ. 7 వేల నుంచి రూ. 25వేల వరకు అదనంగా పెరగనుంది. జలమండలిలో పనిచేస్తున్న 3900 మంది ఉద్యోగులకు 3200 మంది పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, 500 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ వర్తిస్తుందన్నారు.

పిఆర్సీ అమలుతో ఉద్యోగుల్లో సంబరాలు 

జలమండలి ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు గుర్తింపు యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. వాటర్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ, టిఆర్‌ఎస్‌కెవి అన్ని డివిజన్‌లో సంబరాలు నిర్వహించింది. సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ యూనియన్ అధ్యక్షులు జి. రాంబాబు యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంచుకుని, టపాకాయలు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా యూనియన్ అధ్యక్షులు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ కార్మిక పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వాటర్‌బోర్డు ఉద్యోగులపై ప్రత్యేక ప్రేమ ఉందని, దాని దృష్టిలో ఉంచుకుని ఈమధ్యకాలంలో ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. బోర్డు ఆదాయం తగ్గినప్పటికి ఉద్యోగుస్తులకు పిఆర్సీ ప్రకటించి ఉద్యోగస్తులపై అభిమానాన్ని చాటుకున్నారు. పిఆర్సీ కొంచెం ఆలస్య కావడంతో రాజకీయ చేయాలని ప్రయత్నించిన కొన్ని యూనియన్లకు పిఆర్సీ రావడంతో చెంప చెల్లుమన్నట్లు అయిందన్నారు. అదే విధంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించే విధంగా అన్ని చర్యలు చేపడుతామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News