Tuesday, January 21, 2025

పిఆర్‌సి జివొను వెనక్కి తీసుకోవాలి: వెంకట్రామి రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: రేపు లేదా ఎల్లుండి నుంచి నిరసనలకు సిద్దంగా ఉన్నామని సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి తెలిపారు. పిఆర్‌సి జివొలపై ఎపి సచివాలయ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని, హెచ్ఆర్‌ఎ తగ్గించడాన్ని ప్రతి ఉద్యోగి వ్యతిరేకిస్తున్నారని, ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఎలను భారీగా తగ్గించడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. పిఆర్‌సి జివోను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం సిఎం జగన్ మోహన్ రెడ్డిని కలువడానికి ప్రయత్నం చేస్తున్నామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ప్రతీ అంశంలో రాజీపడితే చరిత్ర మమ్మల్ని క్షమించదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News