Monday, December 23, 2024

ఉప్పల్ భగాయత్ ప్రీ బిడ్ మీటింగ్ విజయవంతం

- Advertisement -
- Advertisement -
మూడో లే ఔట్‌లో అమ్మకానికి 63 ప్లాట్లు
మల్టీపర్పస్ జోన్ కింద అందుబాటులో చిన్న, పెద్ద ప్లాట్లు

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) ఉప్పల్ భగాయత్ మూడో దశ 63 ప్లాట్ల అమ్మకాలకు మంగళవారం సైట్ వద్ద నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశం విజయవంతమైంది. ఈ ప్రీబిడ్ మీటింగ్‌లో భాగంగా హెచ్‌ఎండిఏ సెక్రటరీ చంద్రయ్య ఉప్పల్ భగాయత్ లే ఔట్ ప్రాధాన్యతను వివరించారు.

ప్రస్తుతం 63 ప్లాట్లను ఆన్‌లైన్ వేలంలో పెట్టామని, ఇవన్నీ మల్టీ పర్పస్ యూస్ జోన్ కింద ఉన్నాయని, 323 చదరపు గజాల నుంచి 9,873 చదరపు గజాల స్థలాలు అందుబాటులో ఉన్నాయని సెక్రటరీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టిసి ప్రతినిధి అనురాగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్లాట్ల వివరాలను, నియమ, నిబంధనలను వెల్లడించారు. ఈ సమావేశానికి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సిపిఓ) గంగాధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరికృష్ణ తదితరులు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News