కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2023–24 సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ముడి పదార్థాలు, కన్వర్టర్ నుంచి మెషినరీ తయారీదారుల వరకూ మొత్తం ప్లాస్టిక్ పరిశ్రమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌లో తమకు ఉపశమనం కలిగించే చర్యలను గౌరవనీయ ఆర్థికశాఖామాత్యులు తీసుకుంటారని ప్లాస్ట్‌ఇండియా ఫౌండేషన్ ఆశిస్తుంది. ప్లాస్ట్‌ఇండియా ఫౌండేషన్ యొక్క లక్ష్యమేమిటంటే, భారతీయ ప్లాస్టిక్ పరిశ్రమను వృద్ధి పఽథంలో నడిపించడం. 2025లో ఐదు ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ఈ పరిశ్రమను 2045 నాటికి 25 ట్రిలియన్ డాలర్లుగా చేర్చాలనే లక్ష్యంతో ముందుకు పోతుంది.
ఈ వృద్ధికి తోడ్పడుతూనే భారతదేశాన్ని ప్లాస్టిక్ కోసం అంతర్జాతీయ కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో ప్లాస్ట్‌ఇండియా ఫౌండేషన్ మనస్ఫూర్తిగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు మద్దతు అందిస్తుంది. అయితే మా లక్ష్యం చేరుకునేందుకు ప్రభుత్వం నుంచి సహకారం కోరుకుంటున్నాము.
పాలిమర్‌పై దిగుమతి సుంకాలను 5–7.5% మధ్య ఉండేలా చేయాలి. భారతీయ ప్లాస్టిక్ పరిశ్రమ మరింత పోటీతత్త్వంతో ఉండటానికి ఇది అవసరం. అలాగే ఫినీష్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీని కనీసం 20% చేయడం ద్వారా దేశీయ ప్లాస్టిక్ పరిశ్రమకు మద్దతు అందించాలి. ప్రభుత్వం పునరుత్పాదక వనరులపై దృష్టి సారిస్తోన్న వేళ అనేక అవకాశాలు ప్లాస్టిక్ పరిశ్రమకు కలుగుతున్నాయి. అయితే ఎక్కువ శాతం విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నారు. దేశీయ పరిశ్రమను కాపాడటానికి దిగుమతి సుంకాలను గణనీయంగా పెంచాల్సి ఉంది.
దేశంలో పారిశ్రామికీకరణ పెంచడానికి గౌరవనీయ ఆర్ధిక శాఖామాత్యులు ఈ దిగువ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి…
నిరంతర విద్యుత్‌ను యూనిట్‌కు ఐదు రూపాయల ధరలో అందించాలి. అలాగే కార్మిక చట్టాలు అన్ని చోట్లా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. జీఎస్‌టీని 12% మించకుండా ఉండేలా చూడటంతో పాటుగా వ్యవసాయేతర భూముల కొనుగోలు పరంగా చట్టాలను సరళీకృతం చేయాల్సి ఉంది. పరిశ్రమ అభివృద్ధి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద వడ్డీ రేట్లను సహేతుకంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటుగా సాంకేతికంగా ఏవైనా పొరపాట్లును కంపెనీ చేసినా క్రిమినల్ చర్యగా భావించకుండా ప్రత్యేక కోర్టులో విచారణ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. మొత్తంమ్మీద పరిశ్రమ అనుకూలంగా బడ్జెట్ ఉండటంతో పాటుగా దేశీయ ప్లాస్టిక్ పరిశ్రమ అంతర్జాతీయంగా పోటీపడగలిగే వాతావరణం సృష్టించాలి.