Monday, December 23, 2024

వర్షాకాలం సమీపిస్తోంది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వర్షాకాలం సమీపిస్తున్నందున ప్రీ మాన్‌సూన్ తనిఖీలు నిర్వహించాలని అధికారులను టిఎస్ ఎన్‌పిడిసిఎల్ సిఎండి అన్నమనేని గోపాల్ రావు అధికారులను ఆదేశించారు. ఓవర్లోడ్ ఫీడర్లను గుర్తించి, వాటిపై లోడ్ భారం పడకుండా లోడ్ బదలాయింపు చెయ్యాలన్నారు. ఈ మేరకు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ హన్మకొండ విద్యుత్ భవన్‌లోని కార్పోరేట్ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్లు బి. వెంకటేశ్వరరావు, పి.గణపతి, సంధ్యారాణి, వి. తిరుపతిరెడ్డి లతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల ఎస్‌ఈలు, డీఈలు, ఎస్‌ఏఏఓలతో కలిసి బుధవారం సంస్థ సిఎండి అన్నమనేని గోపాల్ రావు విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా గోపాల్ రావు మాట్లాడుతూ బిల్లింగ్ కాని సర్వీసులు ఉన్నవాటికి బిల్లింగ్ అయ్యేటట్లు చూడాలని , అలాగే కాలిపోయిన, పనిచెయని మీటర్లను మార్చాలని అధికారులకు సూచించారు. బిల్ స్టాప్ , అండర్ డిస్కనెక్షన్ సర్వీసులను తనిఖీలు చెయ్యాలన్నారు. గిరివికాసంలో పెండింగ్ ఉన్న వాటిని త్వరితగతిన మంజూరు చెయ్యాలన్నారు. రెండు సంవత్స రాలు పై బడిన వర్క్ ఆర్డర్స్ పూర్తి చెయ్యాలన్నారు. డిపార్ట్‌మెంట్ వాహనాలలోనే ఫేలయిన ట్రాన్స్ ఫార్మర్ల తరలింపు చెయ్యాలన్నారు. కమర్షియల్ సర్వీసులను వెంటనే మంజూరు చెయ్యాలని గోపాలరావు సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్(హెచ్ ఆర్ డి ,పి ఎంఎం) బి.వెంకటేశ్వరరావు, డైరెక్టర్ (ఐపిసి,ఆర్ ఏసి) పి.గణపతి, డైరెక్టర్(కమర్షియల్) పి.సంధ్యారాణి, ఇంచార్జ్ డైరెక్టర్ (ఫైనాన్స్) వి.తిరుపతి రెడ్డి , సి.జి.యంలు అశోక్ కుమార్, సదర్ లాల్ , రాజుచౌహాన్ , ఎస్‌ఈలు, డిఈలు, ఎస్‌ఏఓలు, డిఈ(ఐటి)అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News