న్యూఢిల్లీ : కరోనా టీకా కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసిన అవసరం లేదని, 18 ఏళ్లు దాటిన వారెవరైనా సమీపాన గల వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి అప్పటికప్పుడు కొవిడ్ యాప్‌లో నమోదు చేయించుకుని టీకా వేయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీకా కోసం ముందుగా అపాయంట్‌మెంట్ తీసుకోవడం వల్ల టీకా డ్రైవ్‌లో అనవసర జాప్యం జరుగుతున్నట్టు కేంద్రం గమనించి ఈ నిర్ణయం తీసుకుంది. మరో వైపు టీకాపై ్ల అనుమానాలతో చాలా ప్రాంతాల్లో ప్రజలు ముందుకు రావడం లేదు. దీనిపై శాస్త్రీయ విధానం ద్వారా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిప్రాయపడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో టీకా వేయించుకోడానికి ఓ వృద్ధురాలు భయపడి దాక్కోవడం, మధ్యప్రదేశ్‌లో టీకా సిబ్బందిపై ఓ గిరిజన గ్రామస్థులు దాడి చేయడం తదితర సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో టీకాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహప పెంపొందించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.