Friday, December 27, 2024

ప్రీ వెడ్డింగ్ షూట్..అధికారిక వాహనం వాడిన అధికారిణి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఓ మహిళా ఎస్సై ఏకంగా పోలీస్ డిపార్ట్‌మెంట్ వాహనాన్ని వాడుకుంది. వెస్ట్‌జోన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న సదరు యువతికి ఆర్‌ఎస్సైగా పనిచేస్తున్న యువకుడితో వివాహం కుదిరింది. ఇద్దరు కలిసి ప్రీ వెడ్డింగ్ వీడియో తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి ఏకంగా పోలీస్ స్టేషన్‌ను వేదికగా చేసుకున్నారు. ఇద్దరు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుండడంతో డిపార్ట్‌మెంట్‌కు చెందిన కార్లను ప్రీ వెడ్డింగ్ షూటింగ్‌కు వాడుకున్నారు.

ఇందులో మహిళా ఎస్సై ఓ పిటీషన్‌ను చూస్తున్నట్లు, అదే సమయంలో ఆమెకు కాబోయే భర్త ఆర్‌ఎస్సై పోలీస్ కారులో రావడం వీడియో తీశారు. ప్రీ వెడ్డింగ్ షూటింగ్‌ను ఏకంగా పోలీస్ స్టేషన్‌లో తీయడంపై పలువురు మండిపడుతున్నారు. పోలీస్ వాహనాలను వాడడమే కాకుండా స్టేషన్ ఆవరణలోనే షూటీంగ్ తీయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళా ఎస్సైపై గతంలో పలు అవినీతి ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎస్సైలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News