Wednesday, November 6, 2024

ఫలితాల వేళ కాంగ్రెస్ పార్టీ ముందుజాగ్రత్త చర్యలు

- Advertisement -
- Advertisement -

అప్రమత్తమైన అధిష్టానం
రంగంలోకి కర్ణాటక డిప్యూటీ సిఎంతో పాటు పలువురు ముఖ్య నాయకులు
కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరూ హైదరాబాద్ రావాలని అధిష్టానం ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్: మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాల కంటే ఆ తర్వాత జరగబోయే పరిణామాలపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం ఫలితాల వేళ కాంగ్రెస్ పార్టీ ముందుజాగ్రత్త చర్యలకు దిగింది. కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. కాంగ్రెస్ అభ్యర్థులకు కాపాడుకునేందుకు కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్‌ను రంగంలోకి దింపింది. డికె శివకుమార్‌తో పాటు చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, సూర్జేవాలా తదితర ముఖ్య నేతలను సైతం అధిష్టానం రంగంలోకి దింపడం ఆసక్తికరంగా మారింది.

హైకమాండ్ ఆదేశాలతో కర్ణాటక రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జార్జ్, మంత్రి బోసురాజు, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, రమేష్ చిన్నితల, దీపాదాస్ మున్సీ, ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, బిసి విష్ణునాథ్‌లు శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే గెలుపొందే అభ్యర్థులు చేజారకుండా అభ్యర్థులంతా తక్షణమే హైదరాబాద్‌కు రావాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. శనివారం సాయంత్రానికి తాజ్ కృష్ణకు అభ్యర్థులందరూ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐసిసి ప్రతినిధులు వారికి కీలకమైన విషయాలపై దిశానిర్ధేశం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News