Thursday, January 23, 2025

వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

- Advertisement -
- Advertisement -

శిశువులు, నాలుగేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు, 65 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు వడగాడ్పులు అత్యంత ప్రమాదకరం. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధి, ఊబకాయం, తక్కువ బరువు, అధిక రక్తపోటు, మధుమేహం, మానసిక అనారోగ్యం, మద్యపానం, ఉన్నవారికి కూడా వేసవి ప్రాణగండమే. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా టవలు లేదా రుమాలు వంటిది చుట్టుకోవాలి. కళ్లు పొడిబారకుండా ఉండాలంటే సన్‌గ్లాసెస్ తప్పకుండా పెట్టుకోవాలి. తలకు నేరుగా ఎండ తగలకుండా టోపీ పెట్టుకోవాలి. తెల్లని వస్త్రాలు మాత్రమే వేసుకోవాలి. నల్లని దుస్తులు వద్దు. బిగుసైన దుస్తులు ధరించడం మంచిది కాదు. వ్యాయామానికి రెండు గంటల ముందు 24 ఔన్సుల ద్రవాన్ని తాగాలని, వ్యాయామం చేసే ముందు మరో 8 ఔన్సుల నీరు లేదా స్పోర్ట్ డ్రింక్‌ని తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

Also Read: ఏటా 60 లక్షల మందిని పీడిస్తున్న కుషింగ్ సిండ్రోమ్

వ్యాయామం చేసే సమయంలో మీకు దాహం అనిపించక పోయినాసరే ప్రతి 20 నిమిషాలకు మరో 8 ఔన్సుల నీటిని తీసుకోవాలి. కెఫీన్ లేదా ఆల్కహాలు ఉన్న ద్రవాలను అతిగా తీసుకోరాదు. అవి శరీరం లోని ద్రవాలను కోల్పోయేలా చేస్తాయి. శరీరాన్ని వేడెక్కిస్తాయి. వేసవిలో కాసింత ఉప్పు పానీయం తీసుకోవడం మంచిదే. అయితే రక్తపోటు సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకోవాలి. వడదెబ్బ నుంచి కోలుకున్నవారు అలసటగా ఉంటారు కాబట్టి కొద్ది రోజుల పాటు పెద్దపెద్ద పనులు చేయకుండా ఉండాలి.

Also Read: Black Fever: బ్లాక్ ఫీవర్ చాలా డేంజర్

అలాగే వ్యాయామం కొన్నాళ్లపాటు చేయరాదు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి. రోజుకు రెండుసార్లు అయినా బటర్ మిల్కు తాగాలి. పెప్పరమెంట్ ఆయిల్, లావెండర్ ఆయిలు, ఆల్మండ్ ఆయిల్, కలిపి ఆ మిశ్రమంతో మర్ధన చేయాలి. ఉల్లిగడ్డ రసం, తేనె కలిపి తాగిస్తే మంచిది. ఈ మిశ్రమాన్ని చెవులకు, ఛాతీకి, పాదాలకు పెట్టొచ్చు. కొత్తిమీరి రసం, చింతపండు, తేనె, ఆపిల్ స్లైడ్, వెనిగర్ తాగించాలి. శాండిల్ వుడ్ పేస్ట్ ఒళ్లంతా రాయించి, ఓ పదిహేను నిముషాల తరువాత చన్నీటితో స్నానం చేయించాలి. మసాలా కారం ఎక్కువగా వేసిన వంటకాలు వద్దు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News