Thursday, April 24, 2025

అమెరికా డ్రోన్ల ధరలు ఖరారు కాలేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికా నుంచి భారతదదేశం దిగుమతి చేసుకునే అధునాతన డ్రోన్ల విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆదివారం స్పందించింది. యుఎస్ డ్రోన్ల కొనుగోలు ధరలు ఇంకా ఖరారు కాలేదని, ధరలు నిర్ణయించారనే వార్తలు సరికాదని వివరణ ఇచ్చారు. అమెరికాకు చెందిన జనరల్ ఆటామిక్స్ రక్షణ సంస్థ ఈ డ్రోన్లను భారత్‌కు సమకూరుస్తోంది. ఈ సంస్థ ప్రతిపాదిత ధరలను ఇతర సంస్థల ధరలతో సరిపోల్చుకున్న తరువాతనే తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు.

31 ఎంక్యూ బి డ్రోన్లను అమెరికా నుంచి తీసుకోవాలని రక్షణ మంత్రిత్వశాఖ సంకల్పించింది. అందుబాటు ధర ఉంటేనే వీటిని తీసుకుంటారని రక్షణ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ధరలు ఖరారయ్యాయని, ఇక ఇండియాకు ఈ డ్రోన్లు తరలిరానున్నాయని సోషల్ మీడియాలో అనాలోచితంగా వెల్లడించడం అనుచితం అని, సైనిక రక్షణ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో ఈ విధంగా తప్పుడు వార్తలు వెలువరించడం బాధ్యతారాహిత్యం అవుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News