హైదరాబాద్: నటి సమంత, నటుడు నాగచైతన్యపై సోషల్ మీడియాలో విపరీతమైన పోస్ట్‌లు వచ్చాయి. వారిద్దరూ దూరం కాడానికి ప్రీతమ్ జకల్కర్ కారణమని నిజానిజాలు తెలుసుకోని చాలా మంది దూషించారు. అయితే అతడిప్పుడు ఆ వదంతులపై ప్రతిస్పందించాడు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో “సమంతని నేను అక్కలా భావిస్తాను. ఆమెను నేను జీజీ(అక్క) అని హిందీలో పిలుస్తాను. అలాంటిది మా మధ్య ఏదో ఉందని ఎలా సందేహిస్తారు?” అని ప్రశ్నించాడు. తనకు నాగచైతన్యకు పరిచయం ఉందని, సమంతతో తాను ఎంత సన్నిహితంగా ఉంటానో కూడా అతనికి తెలుసునని అన్నాడు. నాగచైతన్య నోరువిప్పితేనే ఈ వదంతులకు తెరపడుతుందని కూడా జుకల్కర్ అన్నాడు.
“నాగచైతన్య, సమంత విడిపోయినట్లు ప్రకటించినప్పుడు నేను చాలా నిందలకు గురయ్యా. చాలా మంది నా మీద లేనిపోనివి వాగారు. ఆ సమయంలో మానసికంగా చాలా వేదనకు గురయ్యా. ఏదిఏమైనప్పటికీ సమంతకు నేను ఎల్లప్పుడూ అండగా నిలబడతా” అని వివరించాడతను. అతడికి చంపేస్తామన్న బెదిరింపులు కూడా కొందరు అభిమానుల నుంచి వస్తున్నాయని వినికిడి. ఇదిలాఉండగా సమంత ప్రస్తుతం తన పనుల్లో బిజీగా ఉంది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’అనే టివి షో ఎపిసోడ్, ‘శాకుంతలం’, ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.