- Advertisement -
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి) చైర్‌పర్సన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతీ సూదన్‌ను కేంద్రం బుధవారం నియమించింది. ఈ నెల మొదట్లో యుపిఎస్‌సి చైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం యుపిఎస్‌సి సభ్యురాలిగా ఉన్న ప్రీతి సూదన్ గురువారం చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.
యుపిఎస్‌సి చైర్‌పర్సన్‌గా ప్రీతి సూదన్ నియామకాన్ని రాష్ట్రపతి ఆమోదించినట్లు ఒక అధికారి ప్రకటన తెలిపిపింది. ఆమె 2025 ఏప్రిల్ 29 వరకు ఈ పదవిలో కొనసాగతారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన ప్రీతి సూదన్ వివిధ హోదాలలో పనిచేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా 2020 జులై వరకు మూడేళ్ల పాటు ఆమె పనిచేశారు. సోని రాజీనామాను కూడా రాష్ట్రపతి ఆమోదించారు.
- Advertisement -