- Advertisement -
సీట్ల కేటాయింపులో మహిళలకు పెద్దపీట : ఎంపి లక్ష్మణ్
మన తెలంగాణ/హైదరాబాద్ : అభ్యర్థుల ఎంపికలో బిజెపి సామాజిక న్యాయం పాటిస్తుందని ఆపార్టీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిస్తుందని తెలంగాణ నుంచి 50 పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి అందించామన్నారు. ఏక్షణంలో అయినా అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. అభ్యర్థుల ఎంపికలో తమ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తుందని స్పష్టం చేశారు. సీట్ల కేటాయింపులో మహిళలు, బిసిలకు పెద్ద పీట వేసిన ఘనత బిజెపికే దక్కుతుందన్నారు. మహిళలకు సీట్ల విషయంలో ఇతర పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. మొదటి విడతలో బీసీలకు 20 పైగా సీట్లు కేటాయిస్తున్నామన్నారు.
- Advertisement -