Wednesday, January 22, 2025

గర్భస్థ లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకం

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: గర్భస్థ లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకమని, ఇందుకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ప్రమోద్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా అడ్వైజరి కమిటీ సమావేశాన్ని జిల్లా కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జిల్లాలో వెయ్యి మంది మగ పిల్లలకు 936 మంది ఆడ పిల్లలు జన్మిస్తున్నారని, జిల్లాలో ఆడపిల్లలను కనడానికి ప్రభుత్వం వివిధ రకాల ప్రోత్సహకాలను అందిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల్లో లింగనిర్దారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కన్వీనర్ కావేటి రాజగోపాల్, పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, మెడికల్ సూపరింటెండెంట్ శౌరయ్య, జిల్లా సమాఖ్య ప్రతినిధి సరస్వతి, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News