Sunday, December 22, 2024

వైద్య సిబ్బంది నిర్వాకంతో తల్లీ, బిడ్డ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని రావవరంలోని మాత శిశు కేంద్ర ప్రభుత్వ వైద్యశాలలో ఈనెల 24న మంగళవారం తల్లి బిడ్డల మృతికి కారణమైన విషాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్‌ఏ కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సంబంధిత అధికారులకు ఒక లేఖ ద్వారా తెలియజేశారు. 24వ తేదీ మంగళవారం నాడు పురిటి నొప్పులతో ప్రసవానికి వచ్చిన చింతాల సింధు (వయసు 23) మాత శిశు కేంద్రం వైద్య సహాయం అందించడంలో సిబ్బంది అలసత్వం వలన ప్రసవానంతరం తల్లి బిడ్డలు ఇద్దరు మరణించారని సాంబశివరావు ఆ లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వ వైద్యశాలలో భద్రత భరోసా కల్పించడంలో వైద్య సిబ్బంది అలసత్వ ప్రదర్శిస్తున్నారని, ఈ సంఘటన ప్రజలలో ప్రభుత్వ వైద్యశాలపై అపనమ్మకాలను పెంచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలను కేంద్రంలోని డిఎంఇ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారికి తెలియజేసినప్పటికీ వారు ఇంతవరకు స్పందించకపోవడం పట్ల సాంబశివరావు తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబానికి తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ వైద్యశాలలో ప్రసూతి కేంద్రాలపై ప్రజలలో విశ్వాసం, నమ్మకం పెరిగేలా తగిన చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News