డబ్బులు చెల్లించలేదని ట్రీట్ మెంట్ కు నిరాకరించడంతో ఓ గర్భిణీ మృతి చెందింది. ఈ విషాద సంఘటన పూణేలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. తనీషా భిసే అనే ఏడు నెలల గర్భిణీ పరిస్థితి సీరియస్ ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం పూణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రి యాజమాన్యం రూ. 20 లక్షలు డిపాజిట్ చేయాలని గర్బిణీ కుటుంబానికి చెప్పింది. వారు గంటలోపు రూ. 3 లక్షలు ఏర్పాటు చేశారు.. కానీ బిల్లింగ్ విభాగం డబ్బును తీసుకోవడానికి నిరాకరించింది. మొత్తం డబ్బు కడితేనే చికిత్స జరుగుతుందని తేల్చి చెప్పింది.
ఈ క్రమంలోనే తనీషాకు రక్తపోటు పెరిగి.. రక్తస్రావం ప్రారంభమైంది. అయినా ఆస్పత్రి సిబ్బంది ఆమెను చేర్చుకోలేదు. దీంతో ఆమెను మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె కవలలకు జన్మనిచ్చిన తర్వాత ప్రాణాలను కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రి వద్ద ఆందోళన దిగారు. చికిత్స అందించకుండా హత్య చేశారని బాధితలు ఆరోపించారు. కానీ, ఆస్పత్రి యాజమాన్యం వారి ఆరోపణలను తోసిపుచ్చింది.
ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. మహిళ మరణంపై దర్యాప్తు చేయడానికి పూణేలోని జాయింట్ కమిషనర్ ఆఫ్ ఛారిటీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బాధితు కుటుంబాన్ని తప్పకుండా న్యాం జరుగుతుందని.. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని సిఎం హామీ ఇచ్చారు.Pregnant woman ends life after Pune hospital denies treatment