Wednesday, January 22, 2025

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

- Advertisement -
- Advertisement -

మూకుమ్మడి సెలవుల్లో వైద్యులు ఉండడం, సరైన సమయంలో వైద్యం అందక గర్భిణి మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇటీవల కుర్చీపైనే మహిళ డెలివరీ సంఘటనపై కలెక్టర్ డ్యూటీ డాక్టర్‌కు, నర్సులకు సంజాయిషీ నోటీసు ఇచ్చారు. దీంతో మనస్థాపం చెందిన డాక్టర్లు, నర్సులు విధులకు దూరంగా ఉండి నిరసన తెలుపుతూ మూకుమ్మడి సెలవుల్లో ఉన్నారు. షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విధులకు గైర్హాజరు కావడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మాడ్గులపల్లి మండలం, గ్యారకుంట పాలెంకు చెందిన గర్భిణి చెరుకుపల్లి శ్రీలత శనివారం అర్ధరాత్రి డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చి నిండుగర్భంతో నానా అవస్థలు పడింది.

చివరకు హాస్పిటల్ నుండి బయట ఆసుపత్రికి వెళ్లాలని చూస్తే అక్కడి డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్ ఆమెతో మాట్లాడి..లోపలికి తీసుకెళ్లి పరీక్షలు చేసింది. కడుపులో శిశువు హార్ట్ బీట్ తగ్గుతోందని, వెంటనే సిజేరియన్ చేయగా అప్పటికే మృతశిశువు జన్మించింది. అయితే సకాలంలో సిజేరియన్ చేస్తే శిశువు బతికేదని, వైద్యం అందడంలో ఆలస్యం కావడంతోనే మృతశిశువు జన్మించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ మూర్తి మాట్లాడుతూ.. ఆసుపత్రిలో మూకుమ్మడిగా వైద్యులు సెలవులు పెట్టి విధులకు హాజరు కాని విషయం వాస్తవనని అన్నారు. అక్కడే డ్యూటీలో ఉన్న డాక్టర్ సదరు గర్భిణి అనారోగ్యంతో జ్వరంతో బాధపడుతుందని గ్రహించి వెంటనే పరీక్ష చేయగా శిశువు హార్ట్ పల్స్ రేటు పడిపోతోందని గుర్తించిందని తెలిపారు. అప్పటికే పరిస్థితి విషమించిందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News