Wednesday, January 22, 2025

యంత్ర సాయంతో పండంటి బిడ్డను ప్రసవించిన తల్లి

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ ః కింగ్ కోఠి జిల్లా దవాఖానాలో మొట్టమొదటి సారిగా వాక్యూమ్ యంత్ర సాయంతో గర్బీణీకి ఇబ్బంది లేకుండా సాధారణ ప్రసవం చేశామని గైనిక్ హెచ్‌ఓడి డా.జలజ విరోనికా తెలిపారు.ఈనెల 29న చంపాపేట్ ప్రాంతానికి చెందిన మోనమ్మ ఓంప్రకాష్ మొదటి ప్రసవం నిమిత్తం ఆసుపత్రిలో అడ్మిన్ అయ్యిందని అన్నారు. శుక్రవారం ఉదయం పరీక్షలు చేపట్టగా వైద్యులు మోసమ్మ గర్భంలో నాలుగు కిలోల మగశిశువు పెద్ద తలతో ఉన్నట్లు తేలింది.

నార్మల్ ప్రసవం జరిగేలా ఉన్నప్పటికి శిశువు తల కారణంగా తల్లి ఇబ్బందిపడే అవకాశం ఉన్నట్లు గుర్తించారు.దీంతో అత్యాధునిక యంత్రమైన వాక్యూమ్‌తో సులువుగా ప్రసవం జరిగేలా చేసి తల్లికి ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకున్నారు.ఈసందర్భంగా ఆపరేషన్ చేసిన డా.సరీత వైద్యబృందాన్ని డా.జలజ,సూపరింటెండ్ డా.రాజేంద్రనాథ్,ఆర్‌ఎంఓ డా.సాధనలు అభినందించారు.తన భార్యా,బిడ్డలను కాపాడిన గైనకాలజీ వైద్య బృందానికి ఓంప్రకాష్,మోనమ్మ దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News