Wednesday, April 2, 2025

శిథిలాల నుంచి సజీవంగా గర్భిణి

- Advertisement -
- Advertisement -

మూడు రోజుల తరువాత ఓ గర్భిణిని సజీవంగా శిథిలాల నుంచి సహాయక సిబ్బంది రక్షించగలిగారు మాండలేలోని గ్రేట్‌వాల్ హోటల్ శిథిలాల నుంచి ఆమెను బయటకు తీసినట్టు అధికారులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకుపోయిన తమవారు సజీవంగా ఉండొచ్చనే ఆశతో అనేక మంది తమ చేతుల తోనే శిథిలాలను తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటివరకు బయటకు తీసిన వారిలో ఒక్క మహిళ తప్ప మరెవరూ ప్రాణాలతో లేరని అధికారులు పేర్కొన్నారు. శిథిలాలను తొలగించేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News