Monday, December 23, 2024

గర్భిణిపై సామూహిక అత్యాచారం..ఆపై నిప్పు

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని మొరేనాలో ఒక గర్భిణిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెకు నిప్పంటించారు. తీవ్ర గాయాలపాలైన ఆ 34 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ అమానుష ఘటన అంబా పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలోని చాంద్‌కా పురా గ్రామంలో శుక్రవారం సంభవించిది. 80 శాతం కాలిన గాయాలతో బాధితురాలు గ్వాలియర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఒక అధికారి తెలిపారు. తన భర్తపైన అత్యాచార ఆరోపణలు చేసిన ఒక మహిళతో రాజీ కుదుర్చుకోవడానికి బాధితురాలు ఆ గ్రామానికి వెళ్లిందని అంబా పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అలోక్ పరిహార్ శనివారం తెలిపారు.

అయితే ఆ సమయంలో ఆ మహిళ ఇంట్లోనే ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆ ముగ్గురితోపాటు ఆ ఇంట్లోని మహిళ కూడా బాధితురాలిపై పెట్రోల్ చల్లి నిప్పంటించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఆ మహిళ ముందే తనను ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత తనకు నిప్పంటించారని బాధితురాలు ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో వీడియో వాంగ్మూలం ఇచ్చింది. ఆ వీడియోను బాధితురాలి భర్త పోలీసులకు అందచేశారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News