భువనేశ్వర్: ఏడు నెలల గర్భవతిని భర్త తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో జరిగింది. భర్తను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఝిర్దాపల్లి గ్రామంలో దెబెన్ బహెరా, సౌమ్య బహెరా అనే దంపతులు నివసిస్తున్నారు. దెబెన్ గ్రామ పంచాయతీ అధికారిగా పని చేస్తున్నాడు. దెబెన్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వివాహేతర సంబంధానికి భార్య అడ్డుగా ఉండడంతో ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు.
దెబెన్ దొంగ వేషం వేసుకొని అర్థరాత్రి తన ఇంటికి వెళ్లాడు. ఆమె నగలను దొంగలిస్తుండగా ఆమె అరవడంతో తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో భర్త అని తేలడంతో అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. దొంగ రూపంలో తనని భార్యను చంపానని నిజాలు ఒప్పుకోవడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.