Monday, December 23, 2024

కొండాపూర్ లీఫ్ ఆస్పత్రిలో దారుణం…. బాత్రూమ్ లో ప్రసవించిన గర్భిణీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొండాపూర్ లోని లీఫ్ ఆస్పత్రిలో గురువారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన ఆరునెలల గర్భిణీ వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయడంతో శిశువు మృతి చెందింది. ప్రసూతి వైద్యురాలికి బదులుగా నర్సు వైద్యం చేయడంతో గర్భీణి బాత్రూమ్ లోనే ప్రసవించింది. పుట్టిన పది నిమిషాలకే శిశువు మృతి చెందింది. నొప్పులు పెరుగుతున్నా ఆస్పత్రి వర్గాలు నిర్లక్యం వహించాయి. హడావిడిగా పసికందు మృతదేహాన్ని కొండాపూర్ సిఆర్ ఫౌండేషన్ స్మశాన వాటికకు తరలించారు. రెండు రోజుల తర్వాత విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. శిశువు మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. కొండాపూర్ స్మశాన వాటికకు పోలీసులు చేరుకోగా స్థానికులు భారీగా తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News