Friday, December 20, 2024

ప్రీ-ఆస్కార్ పార్టీలో జూ.ఎన్టీఆర్‌తో ప్రీతి జింతా సెల్ఫీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  దక్షిణ ఆసియా రాణింపును పురస్కరించుకుని ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ‘ప్రీ-ఆస్కార్ పార్టీ’ని ఏర్పాటుచేసింది. ఆ ఈవెంట్ తాలూకు విశేషాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రీ-ఆస్కార్ పార్టీలో నటి ప్రీతి జింతా కూడా పాల్గొన్నారు. ఆమె ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఆమె జూనియర్ ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు.

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు నాటు…’ పాట ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో నామినేట్ అయింది. ప్రీతి జింతా తన భర్త జీన్ గూడెనఫ్, గునీత్ మోంగాతో తీసిన డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ కూడా అకాడమీ అవార్డులకు నామినేట్ అయింది. ప్రీతి ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన ఉద్యమకారిణి మలాల యూసఫ్‌జాయ్‌తో కూడా ఓ ఫోటో దిగింది.

95 అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మార్చి 12న (భారత కాలమాన ప్రకారం మార్చి13 ఉదయం) లాస్ ఏంజెల్స్‌లోని ఓవేషన్ హాలీవుడ్‌లో ఉన్న డోల్బి థియేటర్‌లో జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News