Wednesday, January 22, 2025

నాకు నోటీసులిచ్చే అధికారం పిసిసి క్రమశిక్షణ కమిటీకి లేదు: ప్రేమ్‌సాగర్‌రావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పార్టీ నియమ, నిబంధనలు ఉల్లంఘించారంటూ పిసిసి క్రమశిక్షణ కమిటి నుంచి షోకాజ్ నోటీసు అందుకున్న మాజీ ఎంఎల్‌సి ప్రేమ్‌సాగర్‌రావు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంఎల్‌ఎలు శ్రీధర్‌బాబు, సీతక్కలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ ఆదేశాల మేరకు మంచిర్యాల పర్యటనకు వెళ్లిన పిసిసి మాజీ అధ్యక్షుడు విహెచ్‌ను కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దూషించారని, వారంతా మాజీ ఎంఎల్‌సి ప్రేమ్‌సాగర్‌రావు అనుచరులని పేర్కొంటూ ఫిర్యాదు చేశారు. పరిశీలించిన పిసిసి క్రమశిక్షణ కమిటీ రెండు రోజుల కిందట ప్రేమ్‌సాగర్‌రావుకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. తాను ఎఐసిసి సభ్యుడినని..తనకు షోకాజ్ నోటీసు ఇచ్చే పరిధి పిసిసి క్రమశిక్షణ కమిటీకి లేదని ప్రేమ్‌సాగర్‌రావు స్పష్టం చేశారు. అయినప్పటికీ షోకాజ్ నోటీసుకు ఈ రెండ్రోజుల్లో సమాధానం ఇస్తానని చెప్పారు. సమావేశం అనంతరం గాంధీభవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడారు. హనుమంతరావును దూషించినట్లు వస్తున్న ఆరోపణల్లో తనకు ప్రమేయం లేదని ప్రేమ్‌సాగర్‌రావు పేర్కొన్నారు. అదే విషయాన్ని క్రమశిక్షణ కమిటీకి నివేదిస్తానని చెప్పారు. తాను పార్టీ బలోపేతం కోసం ఎఐసిసి అప్పగించిన డిజిటల్ సభ్యత్వంపై దృష్టి సారించినట్లు తెలిపారు. తన నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వం వేగవంతంగా సాగుతోందన్నారు. ఇప్పటికే లక్షా 5 వేల సభ్యత్వాలు పూర్తయ్యాయని ఇంకా పెరుగుతాయని ధీమా కనబర్చారు.

Prem Sagar Rao reacts on notice of TPCC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News