ఈశాన్య రాష్ట్రం సిక్కింలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సిక్కిం క్రాంతికారి మోర్చా ( ఎస్‌కెఎం) అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్ తమాంగ్ ( 56) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పల్జోర్ స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ఆయనతో ప్రమాణం చేయించారు. తమాంగ్తోపాటు మరో 12 మంది మంత్రులు ప్రమాణం చేశారు. సుమారు 30 వేల మంది ప్రజల మధ్య వరుసగా రెండోసారి వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం నేపథ్యంలో సోమవారం రాజధాని గ్యాంగ్‌టక్ లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు సగం రోజు సెలవు ఇచ్చారు. ప్రేమ్‌సింగ్ తమాంగ్ సారథ్యం లోని సిక్కిం క్రాంతికారి మోర్చా వరుసగా రెండోసారి అధికారం లోకి వచ్చింది. 32 అసెంబ్లీ స్థానాలను ఎస్కెఎమ్ గెలుచుకుని సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. 25 ఏళ్ల పాటు సిక్కింను పాలించిన సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్ కేవలం ఒక్క సీటుకే పరిమితమై, ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు చోట్లా పరాజయం పాలయ్యారు.