Monday, December 23, 2024

‘ప్రేమ కన్నా మించింది ఏముంది లోకంలో’ ఆల్భమ్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ప్రపంచ సంగీత దినోత్సవం పురస్కరించుకొని ‘ప్రేమ కన్నా మించింది ఏముంది లోకంలో’ ఆల్భమ్‌ను ప్రముఖ వైద్యులు గురువారెడ్డి సికింద్రాబాద్‌లోని తన ఆస్పత్రిలో విడుదల చేశారు. బాలసుబ్రమణ్యం చనిపోకముందు పాడిన పాటలను ఆయన జ్ఞాపకంగా దాచుకొని ఆయన మృతిచెందిన తరువాత వాటిని ఆల్భమ్‌గా మలిచి ఆయన జ్ఞాపకంగా విడుదల చేయడం హర్షణీయమని గురువారెడ్డి పేర్కొన్నారు. 22 సంవత్సరాల తరువాత మళ్లీ ఈ పాటతో సంగీత దర్శకుడిగా వాసు రెండో అధ్యాయం మొదలుపెట్టడం గర్వించదగ్గ విషయమని గురువారెడ్డి తెలిపారు.

దీనికి సంబంధించిన వీడియోను కూడా త్వరలో విడుదల చేయాలని వాసుకు గురువారెడ్డి సూచించారు. వాసు ఈ ఆల్భమ్‌కు చక్కటి సంగీతాన్ని అందించారని గురువారెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ఆల్భమ్‌లోని పాటలు కచ్చితంగా శ్రోతలను అలరిస్తాయని గురువారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆల్భమ్ విడుదల కార్యక్రమంలో సౌండ్ ఇంజనీర్ సజిదాఖాన్, సంగీత విద్వాంసులు లలిత్ సురేష్, పేరడీ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News