Monday, December 23, 2024

సన్ లైటు, మూన్ లైటు, మించిందేరా లవ్ లైటు..

- Advertisement -
- Advertisement -

నేటి తరం యువత ని ఆకట్టుకునే సరికొత్త కథతో దర్శకుడు ప్రణీత్ సాయి నేతృత్వంలో యువ నటుడు శ్రీ సింహా హీరోగా రూపొందుతున్న చిత్రం ‘భాగ్ సాలే’. ఫస్ట్ లుక్ నుండే ఈ చిత్రం పై ఆసక్తి పెంచుతోందీ సినిమా. ఒక్కో లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తూ మ్యాజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది భాగ్ సాలే మూవీ. ఈ చిత్రం నుంచి తాజాగా ‘ప్రేమ కోసం’ అనే మాస్ నెంబర్ ను విడుదల చేశారు.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ స్వరకల్పనలో కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను మంగ్లీ ఎనర్జిటిక్ గా పాడింది. నందినీ రాయ్ తన డాన్సులతో పాటకు జోష్ తీసుకొచ్చింది. సన్ లైటు, మూన్ లైటు, మించిందేరా లవ్ లైటూ ..వద్దు చాటు, వద్దు లేటు..ఉంటే చాలు కొంత చోటు అంటూ సాగిందీ పాట. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నేహా సొలంకి హీరోయిన్ గా నటిస్తుండగా జాన్ విజయ్ మరియి నందిని రాయ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఆద్యంతం థ్రిల్ చేసే ఈ కథలో రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎడిటింగ్ కార్తీక ఆర్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ రమేష్ కుషేందర్ చేస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News