Tuesday, January 21, 2025

క్లాసికల్ టచ్‌తో ‘ప్రేమ…’

- Advertisement -
- Advertisement -

సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’. స్టోరీ క్యాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఒరిజినల్స్ అసోసియేషన్ విత్ ఎం.ఆర్.ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుభాష్ చంద్ర దర్శకత్వంలో ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మేకర్స్ బుధవారం ‘ప్రేమ…’ అనే మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. నాగవంశీ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. క్లాసికల్ టచ్‌తో సాగే ఈ పాట అందరి హృదయాలను ఆకట్టుకుంటోంది. పాటలో హీరోయిన్ ఫల్గుణి ఖన్నా తన మనసులో సంతోష్ శోభన్‌పై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంది. దినేష్ కక్కెర్ల ఈ పాటను రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News