Sunday, September 22, 2024

కంటెంట్ ప్రకారమే లిప్‌లాక్స్

- Advertisement -
- Advertisement -

జిపిఎస్ హీరోగా మురళి రామస్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ఈ చిత్రాన్ని పి.యస్.రామకృష్ణ, రాహుల్ పండిట్, యుగంధర్, వైజాగ్ మురళి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హీరో జిపియస్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు..
హీరో కావాలనే లక్షంతో…
నటుడిగా మొదట నేను ‘నేనొస్తా’ అనే సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించా. అందులో నా పాత్రకు మంచి పేరొచ్చింది. రివ్యూస్‌లో నా నటన గురించి ప్రత్యేకంగా రాశారు. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. కానీ హీరో కావాలనే లక్షంతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాను.
నన్ను, డైరెక్టర్‌ను నమ్మి…
ఈ చిత్ర దర్శకుడు మురళి రామస్వామి ఒక రోజు నాకు ‘ప్రేమ పిపాసి’ స్టోరీ వినిపించాడు. నాకు చాలా బాగా నచ్చింది. ఇక పియస్ రామకృష్ణ, యుగంధర్, రాహుల్ భాయ్, వైజాగ్ మురళి నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మించారు. నన్ను, డైరక్టర్‌ను నమ్మి మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు.
వన్‌మ్యాన్ ఆర్మీలా నా పాత్ర…
ఈ సినిమాలో కథ రెగ్యులర్ స్టోరీలా కాకుండా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా మొత్తం నా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వన్‌మ్యాన్ ఆర్మీలా నా పాత్ర ఉంటుంది. ఇక సినిమాలో లిప్ లాక్స్ కంటెంట్ ప్రకారమే ఉంటాయి తప్ప కావాలని పెట్టలేదు.
హీరోయిన్ల పాత్రలు డిఫరెంట్‌గా..
ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇందులో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. అందరి పాత్రలు డిఫరెంట్‌గా ఉంటాయి.
తేజకి ఏకలవ్య శిష్యుడిని...
నాకు మెగాస్టార్ చిరంజీవి, తమిళ హీరో సూర్య అంటే చాలా ఇష్టం. వీరు నా అభిమాన హీరోలు. ఇక నేను తేజకి ఏకలవ్య శిష్యుడిని. ఆయనను ఫాలో అవుతుంటాను. ఎప్పటికైనా ఆయన డైరెక్షన్‌లో సినిమా చేయాలన్నది నా కోరిక.

Prema Pipasi Hero interview

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News