Wednesday, January 22, 2025

“ప్రేమదేశం” మళ్లీ థియేటర్స్ లో!

- Advertisement -
- Advertisement -

ప్రేమదేశం చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటది. అప్పట్లో ఆ చిత్రంలోని పాటలు, కథ కథనాలు ప్రేక్షకులని అంతలా ఆకట్టుకున్నాయి. ఇందులో స్నేహానికి ప్రాముఖ్యతనిస్తూ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు ఖతిర్‌. టబు, వినీత్‌, అబ్బాస్ నటించిన ప్రేమదేశం సినిమాలో ఎక్కడా వల్గారిటీ అనేది లేకుండా చాలా నీట్‌గా చిత్రాన్ని తీశారు. ఈ సినిమా కోసం రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి.

Premadesam movie re release on dec 09

ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ప్రేమదేశం మళ్లీ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. డిసెంబర్ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల కాబోతోంది. శ్రీ మాతా క్రియేషన్స్ బ్యానర్ పై రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డి, నాగరాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రేమదేశం సినిమా స్పెషల్ షో హైదరాబాద్ లో వేశారు, నటి దివి, నటి శ్రేయ ప్రియ, అర్జున్ కళ్యాణ్ ఈ స్పెషల్ షో కు హాజరయ్యారు. అలాగే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన నిర్మాత కెటి.కుంజుమొన్ హాజరయ్యి ప్రేమదేశం సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News