Monday, December 23, 2024

రొమాంటిక్ కామెడీ ‘ప్రేమలు’ ఓటీటీ డేట్ ఫిక్స్… ఎప్పుడంటే..

- Advertisement -
- Advertisement -

సినిమా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఆ చిత్రానికి పెంచే హైప్ మాములుగా ఉండదు. నెలలు గడిచిన థియేటర్లు హౌస్ ఫుల్ బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతోంది. ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం ప్రేమలు కేరళలోనే కాకుండా తెలుగురాష్ట్రాల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. గిరీష్ ఎడి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ తమిళ డబ్బింగ్ వెర్షన్ సినిమా మార్చి 8న తెలుగులో వెర్షన్ లో థియేటర్లలోకి వచ్చింది. నస్లెన్ కె గఫూర్, మమిత బైజు ఈ డిలైఫుల్ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు.

Premalu OTT releaseప్రేమలు సినిమా మార్చి 29, 2024న ఓటీటీ ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయబడుతుందని ఫిలింనగర్ లో ఓ వార్త వినిపిస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రేమలు చిత్రంలో శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్, సంగీత్ ప్రతాప్ ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేశారు. విష్ణు విజయ్ ఈ చిత్రంలో ఆకట్టుకునే సౌండ్‌ట్రాక్‌ని స్వరపరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News