Tuesday, January 21, 2025

ఎల్బీ స్టేడియంలో ముగిసిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడు తాయని, ఓటమిని నుంచి పాఠాలు నేర్చుకొని గెలిచేందుకు ప్రయ త్నిం చాలి, ఆటల్లో గెలుపు, ఓటములు సహజం అనే విషయాన్ని క్రీడా కారులు గుర్తించాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈమేరకు ఎల్బీస్టేడియంలో “సేవా ఫౌండేషన్ ” ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ ప్రీమియర్ లీగ్ క్రీకెట్ (హెచ్‌పిఎల్‌సి) టోర్నీ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు బండారు దత్తాత్రేయ. ఫైనల్‌లో ఆడుతున్న జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. గత నాలుగు రోజులుగా (29,30,1,2) జరుగుతున్న ఈ క్రికెట్ పోటీల్లో ఇప్పటి వరకు నగర వ్యాపితంగా 32 జట్లు పాల్గొన్నట్లు చెప్పారు.

ఆదివారం ఫైనల్ మ్యాచ్ రా యల్ బ్రదర్స్, చాంఫియన్ ఎలెవన్ టీమ్‌ల మధ్య పోటాపోటీగా జరిగిందని తెలిపారు. 10 ఓవర్ల ఈ ఆటలో గెలిచిన రాయల్‌బ్రదర్స్ టీమ్‌కు ప్రధమ బహుమతి 50వేలు, చాంపియన్ ఎలెవన్ టీమ్‌కు ద్వితియ బహుమతి 25 వేలును గవర్నర్ దత్తాత్రేయ అందజేశారు. ఆటల్లో పాల్గొన్న అందరికి పార్టీ సిపేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వనున్నట్లు ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈకార్యక్రమానికి అతిధులుగా జబర్దస్త్ ఫేమ్ రచ్చరవి, బీజేవైఎం జాతీయ కార్యదర్శి శ్యాంరాజ్, సిటీ అధ్యక్షులు నితిన్ నందేకర్, నందిని డెవలఫర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి కె.విజయలక్ష్మి, సేవాఫౌండేషన్ సభ్యులు అర్జున్, ప్రేమ్‌బిర్‌దర్, రాహుల్‌సేనా, మోహన్‌రాజ్, బీజెవైఎం సిటీ ఉపాధ్యక్షులు కట్ల అశోక్,సెంట్రట్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి ల్ల అవినాష్, బిఆర్‌ఎస్ యూత్ వింగ్ అధ్యక్షులు వినోద్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News