Monday, January 20, 2025

క్రూస్ బోటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నాం.. గెల్లు శ్రీనివాస్ యాదవ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  లాంచీలో విహరించి అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారని తెలంగాణ పర్యాటకాభివృద్ధి శాఖ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఈ మేరకు “మన తెలంగాణ”కు తెలిపారు. ఉదా..నాగార్జున సాగర్ నుండి శ్రీశైలంకు లాంచిలో 120 కిలో మీటర్ల దూరం ఉంటుందని, లాంచిలో ఓ 5 గంటల ప్రయాణం ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉంటుందన్నారు.

తాను ఛైర్మన్‌గా వచ్చాక పలు చోట్ల బోటింగ్ సదుపాయాలను మెరుగు పరిచానన్నారు. ఇటీవల దుర్గం చెరువు.. మెన్నీమధ్య వరంగల్ లోని లక్నవరం తదితర చోట్ల తానూ బోటింగ్ చేసి పర్యాటకులతో తమ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకున్నానన్నారు. మరిన్ని చోట్ల బోటింగ్ ఏర్పాటు చేయాలని పర్యాటకుల నుండి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలోనే త్వరలోనే సోమశిల నుండి శ్రీశైలంకు అలాగే నాగార్జునసాగర్ నుండి శ్రీశైలంకు రెండు వైపులా “ క్రూస్ బోటింగ్ ” సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. నూతనంగా కల్పిస్తున్న ఈ బోటింగ్ పాపికొండల తరహాలో అత్యంత అద్బుతంగా ఉంటుందని గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నూతన బోటింగ్‌కు డబ్బులు ఎంత ఛార్జ్ చేయాలనే దానిపై పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, రేటింగ్ కూడా పొరుగు రాష్ట్రాల కంటే తక్కువగా ఉండేలా చేస్తామన్నారు. సోమశిల నుండి శ్రీశైలం, అలాగే నాగార్జున సాగర్ నుండి శ్రీశైలంకు బోటింగ్ ప్రారంభానికి మంత్రిని ఆహ్వానించి ఆయన చేతుల మీదుగానే ప్రారంభిస్తామని గెల్లు శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News