Friday, January 10, 2025

సాగుకు సన్నద్ద్ధం

- Advertisement -
- Advertisement -

పరిగి: మృగశికార్తె అనంతరం వర్షాలు పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏరువాకతో రావల్సిన వానాకాలం కొద్దిగా ఆలస్యమైనా వర్షాలు కురువడంతో రైతాంగం వర్షాకాలం సాగుకు సిద్దమైంది. ఇప్పిటికే దుక్కులు దున్ని రెడీ చేయగా, విత్తనాలు వేసుకునేందుకు సిద్ద్ధమయ్యారు. సోమవారం, మంగళవారం రాత్రి తెల్లవారుజామున వర్షం పడింది. దీంతో పరిగి నియోజక వర్గంలోని పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల మండలాలలో రైతులు పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న, తదితర విత్తనాలను నాటుతున్నారు. వర్షాలు కురుస్తున్నందున రైతులు సాగులో నిమగ్నమయ్యారు.

నల్ల రేగడి భూములలో పత్తి, చెలక, ఎర్ర నేలలో కంది, జొన్న పంటలను సాగు చేస్తున్నారు. అందుకు కావల్సిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు పరిగి పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలలో రైతులు ఎగబడ్డారు. పూడూరు మండలం మన్నెగూడలో ఆగ్రోస్‌తో పాటు ఇతర విత్తన దుకాణాలలో వివిధ రకాల విత్తనాలు తీసుకవెళ్తున్నారు. గుంపులుగా ఎగబడి కావాల్సిన విత్తనాలు, గడ్డి మందులు, ఎరువులు తీసుకపోతున్నారు. దుకాణాల వద్ద కొరత సృష్టించి దుకాణాల యాజమానులు అధిక ధరలకు అమ్ముతున్నారని, సంబంధిత అధికారులు పర్యవేక్షణ కొరవడంతో కొందరు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News