Friday, April 4, 2025

ఎన్నికలకు కసరత్తు

- Advertisement -
- Advertisement -
119 నియోజకవర్గాలకు రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం
అత్యవసర ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి
ఆర్‌ఓ, ఎఆర్‌ఓ నియామకం, ఉత్తర్వులు జారీ

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలను సజావుగా నిర్వహించేందు కు వీలుగా ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారుల నియామకం చేపట్టింది. రా ష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో రిటర్నిం గ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ గురువా రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అత్యవసర ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ జారీ చేశారు.
జిల్లాల్లో ముమ్మరంగా ఎన్నికల నిర్వహణపై కసరత్తు..
శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ ధృవీకరణ వివరాలపై జిల్లాల వారీగా తహసీల్దార్లతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గంలో పోలింగ్‌స్టేషన్ల వారీగా పూర్తి సమాచారం ప్రతి అధికారి సేకరించాలని, ఈఆర్‌ఓలు ఫామ్-6,7,8 వివరాలను జాగ్రత్తగా పూర్తి చేయాలని ఆదేశించారు.. గరుఢ, ఈఆర్‌ఓ ఆన్‌లైన్ యాప్‌లలో వివరాలు రెండింటిలో సమానంగా ఉండాలన్నారు. తహసీల్దార్లు ప్రతిరోజు పరిశీలించాలని సూచించారు. ఇంటింటికి తిరిగి బూత్ లెవల్ అధికారులు ప్రతి ఓటర్ వివరాలను సరిగా చూడాలని, ముఖ్యంగా చిరునామా, వయస్సుకు సంబంధించి పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన విచారించాలని సిబ్బందికి ఆదేశించారు. ముఖ్యంగా 100,- 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల ఓటర్ల వివరాలను అధికారులు తప్పనిసరిగా పారదర్శకంగా విచారణ చేపట్టాలని సూచించారు. ఈఆర్‌ఓ, ఎఈఆర్‌ఓ, బిఎల్‌ఎస్ సమన్వయంతో అన్ని వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు.
ఈవిఎంల తనిఖీ, మాక్ పోలింగ్..
జిల్లా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఎన్నికల సిబ్బందికి అధికారులు అవగాహన కల్పించారు. ఈవిఎం, వివి ప్యాడ్ పనితీరు, ఎలా ఓటు వేయాలి, ఓటు వేసిన అనంతరం కనిపించే దృశ్యాలేమిటనే అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఓటర్లకు ఎలాంటి అనుమానాలు ఉన్న అవగాహన కేంద్రంలోని అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. శాసనసభ ఎన్నికల నిర్వహణ త్వరలో ఉన్నందున ఎలక్షన్ కోడ్ వచ్చే లోపు ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్ల వారీగా పూర్తి సమాచారం ప్రతి అధికారి సేకరించాలని ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News