Friday, December 20, 2024

ఖరీఫ్ కార్యాచరణకు సమాయుత్తం

- Advertisement -
- Advertisement -

రుణమాఫీ పథకం విధివిధానాలపై సమీక్ష
31లోగా మార్క్‌పెడ్ ద్వారా పంటల కొనుగోళ్లు పూర్తి
వరికొయ్యలు తగులబెట్టే రైతులపై జరిమానాలు
అధికారులకు మంత్రి తుమ్మల అదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఖరీప్ పంటల సాగు కార్యచరణ ప్రణాళికపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులు పంటల సాగుకోసం బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాల మాఫీకి సంబంధించిన విధివిధానాలపై సమీక్షించారు.ఖరీఫ్ 2024 నుండి అమలు అయ్యే పంటల భీమా విధివిధానాలపై దిశా నిర్ధేశం చేశారు. టెండర్లలో పేర్కొనే నిబంధనలు, ముందుకు వచ్చే కంపెనీలకు ఉన్న అర్హతలు, మున్నగునవన్నీ ఒకటికి రెండు సార్లు పరిశీలించుకొని, రైతులు పంటనష్టపోయిన సందర్భములో ఈ భీమా పథకం వారిని ఆదుకొనే విధంగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు.

పథకం అమలుకు ఆదర్శరైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సిందిగా సూచించారు. పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై సరఫరాకు విధివిధానాల రూపకల్పచేసి , వెంటనే సరఫరా ప్రారంభించి, సరఫరాలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడగలరని టీఎస్ సీడ్స్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. మొదటి విడత పంటనష్ట పరిహారం 15 కోట్లు పంపిణీ పూర్తయినందున, రెండోవిడత (ఎప్రిల్ మాసంలో) మూడోవిడత (మే మాసంలో) జరిగిన పంట నష్ట వివరాల సమర్పణకు ఆదేశాలు ఇచ్చారు.

మట్టి నమూనా పరీక్షా కేంద్రాల సామార్థ్యం అనుసరించి, వెంటనే రైతుల విజ్ఞప్తి మేరకు అవసరమున్న రైతుల పొలాల మట్టి నమూనాలు సేకరించి ఫలితాలు వచ్చే నెలాఖరులోగా అందచేసేటందుకు ప్రణాళిక చేసుకోవల్సిందిగా ఆదేశాలిచ్చారు. వరి కొయ్యలు కాల్చకుండా యుద్ధప్రాతిపదికన రైతులకు అవగాహన కల్పించడం, అప్పటికి వినకపోతే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ, వరికొయ్యలు తగలపెడ్తే జరిమానాలు విధించాల్సిందిగా ఆదేశించారు.మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు కొనుగోళ్ళను వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా పూర్తి చేసేవిధంగా ఆదేశించారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కేటాయించిన భూములలో ఆధునిక సాంకేతికతతో పండ్లతోటల పెంపు , నిర్వహణ బాధ్యతలు తీసుకొనేవిధంగా ఆదేశాలిచ్చారు.

ఆయిల్ ఫాం కంపెనీల పనితీరు ఆధారంగా చర్యలు:

మల్బరిసాగుకు అనుకూల ప్రాంతాలను ఎంపిక చేసి పట్టు పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలలో మ్యాచింగ్ గ్రాంటు బకాయి నిధుల విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు .చివరగా అన్ని రకాల సహకారసంఘాలలో సభ్యుల గుర్తింపు, పదవీకాలం ముగిసిన సంఘాల ఎన్నికల నిర్వహణకు సత్వరమే చర్యలు చేపట్టాని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News