Friday, November 22, 2024

ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నద్ధం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో వరికోతల పనులు ప్రారంభమయ్యాయి. పలు జిల్లాల్లో బోరు బావుల ఆధారంగా ముందస్తు వరినాట్లు పడ్డ ప్రాం తాల్లో పైర్లు కోతదశకు వచ్చాయి. రైతులు వరికోతలు కోసి ధాన్యం ఆరబెట్టి మార్కెట్లకు తరలించేపనుల్లో నిమగ్నమవుతున్నారు. మరో వైపు ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోళ్లకు సన్నద్దమవుతోంది. జిల్లాల వారీగా కలెక్టర్ల నేతృత్వంలో వ్యవసాయం , మార్కెటింగ్, పౌరసరఫరాలు, సహకార, గ్రామాణాభివృద్ధి, రవాణ తదితర శాఖల అధికారులతో ధాన్యం కొనుగోళ్ల ప్రణాళికలపై సమీక్షా సమావేశా లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఈవానాకాలం సీజన్ కింద 49.86లక్షల ఎకరాల్లో వరిసాగు చే యించాలని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా లు రూపొందించుకోగా, సీజన్ ముగిసే సరికి రా ష్ట్రంలో మొత్తం 65లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డా యి. వరిసాగులో వ్యవసాయశాఖ ప్రాథమిక అం చనాలను మించి 130.37శాతం విస్తీర్ణంలో వరిపైరు సాగులోకి వచ్చింది.

ముందస్తుగా వరినాట్లు వేసిన ప్రాంతా ల్లో ఇప్పుడిప్పుడే వరికోతలు ప్రారంభమయ్యాయి. దసరా పండగ తర్వాత వరికోతల పనులు ముమ్మ రం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాగాన్ని సన్నద్దం చేస్తోంది. ఈ సీజన్‌లో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించాలని ప్రాథమికంగా లక్ష్యాలు రూపొందించుకుంది. జిల్లాల వారీగా కలెక్టర్ల అధ్యక్షతన ఆ యా జిల్లాల్లో వరిసాగు విస్తీర్ణత, పంట దిగుబడుల ను అంచనా వేసుకుంటూ ఆమేరకు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన జిల్లా స్థాయి ప్రణాళికల ను సిద్దం చేస్తోంది. వరికోతలు జరుగుతున్న ప్రాంతాలను దృష్టిలో ఉం చుకుని ఆ మేరకు దశల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తోంది. ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘా లు, ఐకేపి కేంద్రాల సిబ్బందిని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నద్దం చేస్తోంది. ధాన్యం సేకరణను దృష్టిలో ఉంచుకుని అవసరమైన్ని గన్ని సంచులు సిద్దం చేయిస్తోంది. ప్రాధాన్యత క్రమంలో గన్నీ సంచుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన కనీస వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి సమీక్షా సమావేశాల్లో కలెక్టర్లు సంబంధింత అధికారులకు అదేశాలు ఇ స్తున్నారు.గన్నీ సంచుల పంపిణీ బాధ్యతలను పౌరసరఫరా శాఖ అధికారులకు అప్పగించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసే కాం టాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతలను మార్కెటింగ్ ,గ్రామీణాభివృద్ది శాఖ అధికారులకు అప్పగించారు. రైతులు తమ పొ లంలో వరికోతలు ప్రారంభించటం ,ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించటంలో రైతులంతా ఒక్కసారిగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి అక్కడ గంటలు, రోజుల తరబడి పడిగాపులు కాయకుండా ఒక క్రమ పద్ధ్దతి ప్రకారం ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం టోకెన్ల విధానం అమలు చేయనున్నారు. వ్యవసాయశాఖ అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించారు.

వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) రైతుకు టోకెన్ ఇచ్చాకే ఆ రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చేవిధంగా చర్యలు చేపట్టారు. వరికోతలు పూర్తికాగానే ధాన్యాన్ని ఆరబెట్టి ఎఫ్‌సిఐ నియమ నిబంధనల ప్రకారం తగినంత తేమశాతం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం ,ధాన్యాన్ని మట్టి పెళ్లలు లేకుండా శుభ్రం చేయటం, ధాన్యాన్ని తూర్పారబట్టడం వంటి చర్యలకు సంబంధించిన పనుల భాధ్యతను మార్కెటింగ్ శాఖ అధికార యంత్రాంగానికి అప్పగించారు. తగినన్ని వేయింగ్ మిషన్లు, ప్యాడీక్లీనింగ్ యంత్రా లు, ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు సమకూర్చాలని ఆదేశాలిచ్చా రు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే కోటా మేరకు కేటాయించిన రైస్‌మిల్లులకు చేరవేసేందకు అవసరమైనన్ని లారీలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను రవాణాశాఖ అధికారులకు అప్పగించారు. జిల్లా స్థాయిల్లో ధాన్యం సేకరణ సమీక్షా సమావేశాలకు మిల్లర్లను కూడా ఆహ్వానిస్తున్నారు. ఖరీఫ్ ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ వుంచేందుకు మిల్లుల్లో అవసరమైన జాగాను సిద్ధం చేసి ఉంచుకోవాలని మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు.
సమన్వయ కమిటీలు!
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎక్కడా ఏదశలోనూ ఇబ్బంది పడకుండా కొనుగోళ్లు సజావుగా సాగేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, క్లస్టర్ స్థాయి, మండల స్థాయి , గ్రామ స్థాయిలో ఈ కమీటి లు నిరంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమీక్షించనున్నాయి. ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియన ముందుకు తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News