Friday, November 22, 2024

పెండింగ్ దరఖాస్తు, డ్రాప్ట్ జాబితా రూపకల్పన పకడ్బందీగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -
  • సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజక వర్గంలోని పెండింగ్ దరఖాస్తు, డ్రాప్ట్ జాబితా రూపకల్పన పకడ్బందీగా వేగంగా పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగంగా జాబితా సవరణ పూర్తి చేయాలన్నారు. ఓటర్ జాబితా సవరణలో డ్రాప్ట్ జాబితా విడుదలకు ముందు మనకు వచ్చిన ప్రతి దరఖాస్తు పూర్తి చేయాలన్నాఉ. ఓటర్ జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరణ పూర్తి చేయాలన్నారు. బిఎల్‌ఓస్ ఇంటింటికి తిరిగి 6 కంటే అధికంగా ఉన్న ఓటర్ల వివరాల ధృవీకరణను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఇంటింటి సర్వే నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులు, ఆన్‌లైన్ ద్వారా ఫారం 6 ఫారం 7, 8 కింద వచ్చిన దరఖాస్తులను జూలై 27 నాటికి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.

ఓటరు జాబితా నుంచి ఓటర్ల వివరాలు తొలగించిన నేపథ్యంలో దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలన్నారు. నియోజక వర్గ పరిధిలో ఈవిఎం, వివిప్యాట్ వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నియోజక వర్గంలో ఉన్న మీ మండలాల్లో ఉన్న పోలీంగ్ స్టేషన్‌లను విసిట్ చేయాలన్నారు. భారత ఎన్నికల సంఘం నిర్ధేశించిన విధంగా ప్రతి పోలీంగ్ స్టేషన్‌లో మౌలిక వసతులు ప్రతిది సమకూర్చేలా ఏర్పాటు చేయాలని తహశీల్తార్ లకు తెలిపారు. బిఎల్‌ఓస్, ఈఆర్‌ఓలు అందరు అధికారులు సమన్వయంతో పని చేసి మళి విడత సమావేశం లోపు అన్ని పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బెన్‌సాలమ్, మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News