Friday, November 22, 2024

చంద్రయాన్ 3కి సన్నాహాలు..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చంద్రయాన్ 3 అంతరిక్ష యాత్ర ఈ నెల 13 నుంచి 19 మధ్య జరుగనున్న నేపథ్యంలో సంబంధిత సన్నాహాలు పెద్ద ఎత్తున చేపట్టారు. బుధవారం ఇందులో భాగంగా కీలకమైన క్యాప్సూల్ కలయిక జరిగింది. చంద్రయాన్ 3 వాహకనౌకను ఎల్‌విఎం 3తో అనుసంధానించే ప్రక్రియ జరిగిందని ఇస్రో వర్గాలు బుధవారం తెలిపాయి. వాహకనౌకతో పేలోడ్ సంబంధిత ఎల్‌విఎంను అనుసంధానించడం కీలకమైన ఘట్టం అని ఇస్రో తెలిపింది. చంద్రయాన్ 2 తరువాత మరింత సమర్థతతో చంద్రుడివైపు యాత్రకు భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) సిద్ధమైంది.

చంద్రుడి ఉపరితలంపై సురక్షిత ల్యాండింగ్ , రోవింగ్ సామర్థాలను పూర్తి స్థాయిలో పరీక్షించుకునేందుకు చంద్రయాన్ 3 కీలకం అవుతుంది. బుధవారం శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో అత్యంత కీలకమైన ఎల్‌విఎం అనుసంధాన ప్రక్రియ జరిగిందని బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 13వ తేదీనే చంద్రయాన్ 3ని చేపట్టాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News