కొప్పల్(కర్నాటక): తుంగభద్ర డ్యామ్ కు 33 క్రెస్ట్ గేట్లు ఉన్నాయి. అందులో ఒకటి శనివారం సాయంత్రం(ఆగస్టు 10న) కొట్టుకుపోయింది. డ్యామ్ లో మూడింట రెండు వంతుల నీరు ఖాళీ అయ్యాకే మరమ్మతు పనులు సాధ్యమని అంతా భావించారు. కర్నాటక ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ కూడా ఆదివారం వెళ్లి చూశారు.
ఇదిలావుండగా కొట్టుకుపోయిన గేటు స్థానంలో తాత్కాలిక గేటు అమర్చేందుకు చర్యలు చేపట్టడం సాహసమేనని నిపుణులు తెలిపారు. 19వ నంబర్ గేటు స్థానంలో 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు ఉన్న భారీ గేటును అమర్చేందుకు సిద్ధం అయ్యారు. నీరు ప్రవహిస్తుండగానే దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
పనుల బాధ్యతలు జిందాల్ తో పాటు మరో రెండు సంస్థలకు అప్పగించారు. గేటు ముక్కలను తయారుచేసి తుంగభద్ర డ్యామ్ వద్దకు తీసుకొచ్చే చర్యలు చేపట్టారు. మూడు సంస్థలు తయారు చేసిన ముక్కలను ప్రవాహం మీదనే వెల్డింగ్ చేసి ఏర్పాటు చేయనున్నారు. ఎనిమిది అడుగు భారీ ప్రవాహంలో నీటిని అడ్డుకుంటూ వెల్డింగ్ చేయడం సాహసమే కాగలదు. నిండుగా ఉన్న ప్రాజెక్టులో ఇది సాహసమే అవుతుందని నిపుణులు కూడా అంటున్నారు.