Monday, December 23, 2024

లోక్‌సభ ఎన్నికలకు కసరత్తు షురూ

- Advertisement -
- Advertisement -

ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు నిబంధనలు జారీ చేసిన ఇసి
జనవరి 6 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ

మన తెలంగాణ/హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల కు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్కువ కాలం ఒకే చోట విధులు నిర్వహించే ఉద్యోగులను బదిలీలు చేయాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది. రెవె న్యూ, పురపాలక, పోలీసు తదితర ప్రభుత్వ శాఖ ల అధికారులను ఎన్నికల నోటిఫికేషన్ లోపు చే యాలని పేర్కొంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శా సనసభ ఎన్నికల సందర్భంగా అనేక మంది అధికారులకు స్ధాన చలనం కల్పించారు. ఎన్నికలు ముగిసిన తరువాత బదిలీ అయిన వారిలో చాలామంది తిరిగి గతంలో తాము పనిచేసిన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఎన్నికల ముందు పెద్ద ఎత్తున పోలీసుశాఖలో బదిలీలు జరిగాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారం తరువాత ఎస్‌పి, అదనపు ఎస్‌పి, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు వంటి అనే క మంది ఉన్నతాధికారులను మార్చింది. త్వరలో డిఎస్‌పి, సిఐ, ఎస్సైలను బదిలీ చేసేందుకు ఏర్పా ట్లు చేసింది. ఈలోపే కేంద్ర ఎన్నికల కమిషన్ కూ డా ఉద్యోగుల బదిలీలపై ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల మార్పు తప్పకుండా జరుగుతుండటం తో ఎవరెవరు ఎక్కడికి బదిలీ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇసి నిబంధనల మేరకు సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారిని, నాలుగేళ్ల కాలంలో వరుసగా మూడేళ్లు ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలి. పార్లమెంటు ఎన్నికల సందర్భం గా రాష్ట్రంలో వివిధ మండలాల్లో నాలుగు సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేసే ఎంపిడిఓలను బదిలీ చేయాలని జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్, గ్రా మీణాభివృద్ది శాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ గడువులోగా ట్రాన్స్‌ఫర్ చేయాలని సూచించారు.
జనవరి 6 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ : రాష్ట్ర ఎన్నికల కమిషన్
రాష్ట్రంలో జనవరి 6వ తేదీ నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్ల జాబితాలో పేరు నమోదు, తప్పొప్పుల సవరణ, అడ్రస్ మార్పు వంటి అంశాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2024 జనవరి ఒకటో తేదీలోగా 18 సంవత్సరాలు నిండినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 6న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించి అదే రోజు నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి రెండవ తేదీవరకు పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 6లోగా డేటా బేస్‌లో అప్‌డేట్ చేసిన తర్వాత ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రచురిస్తారు.

2024 అక్టోబర్‌లోగా 18 ఏళ్లు నిండితున్న వారు కూడా ముందస్తుగా ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే, వీరి దరఖాస్తుల పరిశీలన మాత్రం అక్టోబర్ 1 తర్వాత నిర్వహించే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం సందర్భంగా చేపడతారు. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1లోగా 18 ఏళ్లు నిండినవారు కూడా ఓటర్ల జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి ఐదో తేదీ పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు, ఓటర్ల జాబితా, గుర్తింపు కార్డుల్లోని లోపాల సవరణ, ఓటర్ల జాబితాలోని ఫోటో లోపాల సవరణ, పోలింగ్ కేంద్రాల సరిహద్దుల సవరణ తదితర ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News