Monday, March 3, 2025

29న విశాఖలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. ఈ నెల 29న ఆయన విశాఖలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో, బహిరంగ సభకు హాజరు కానున్నారు. ప్రధాని వస్తుండడంతో ఆదివారం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో మోడీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News