- Advertisement -
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో వానాకాలం పంటల సాగుపై మంగళవారం సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… రైతు వేదికల నిర్వహణకు నెలకు రూ. 9వేలు ఇస్తామన్నారు. వరి ధాన్యం కొనుగోలు వల్ల రూ.4 వేల కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం వెనకడుగు వేయకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని పల్లా పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ వ్యవసాయానికి, రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పల్లా తెలిపారు. అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ద్వారా సాగునీరు అందిస్తున్నామని ఆయన వివరించారు.
- Advertisement -