ముఖ్యమంత్రికి సమర్పించేందుకు వీలుగా తయారుచేయాలని అధికారులకు సూచించిన వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, అన్నిస్థాయిల మార్కెట్ల డిమాండ్‌ను, ఆర్ అండ్ ఎ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచన
మనతెలంగాణ/ హైదరాబాద్: యాసంగి పంటల ప్రణాళికలో భాగంగా స్థానిక, జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ ను బట్టి మార్కెటింగ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ సూచనల పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. యాసంగి పంటల ప్రణాళికపై హాకా భవన్‌లో జరిగిన సమీక్షలో మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభిృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, విసి ప్రవీణ్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంత్ కొండిబ తదితరులు పాల్గొన్నారు.
యాసంగిపంటల ప్రణాళికపై కసరత్తు చేయాలని, ఏయే ప్రాంతాల్లో ఏ పం టలు వేయాలి, వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎంత విస్తీర్ణంలో వేయాలి, మార్కెట్ లో పంటల డిమాండ్ ఎలా ఉందన్న తదితర విషయాలపై వ్యవసా య నిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికా రులతో మంత్రి సమీక్షించారు. దీనికి సంబంధించిన నేడు సిఎం కెసిఆర్‌కు తుది నివేదిక సమర్పించాలని మంత్రి అధికారులకు సూ చించారు. నివేదిక పరిశీలన అనంతరం యాసంగి పంటల ప్రణాళి కను సిఎం ఖరారు చేయనున్నట్టు ఆయన తెలిపారు. అధికారులతో సమీక్ష అనంతరం మంత్రిని మర్యాదపూర్వకంగా నానో యూరి యా సృష్టికర్త రమేష్ రాలియా కలిశారు.