Wednesday, January 22, 2025

ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై చర్చలకు సిద్దమని ప్రతిపక్షాలకు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ సవాల్ విసిరారు. ఆదివారం హాలియాలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో సీఏం కేసీఆర్‌పై వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలకు కళ్లల్లో మంటలు మండుతున్నాయన్నారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి జైలు శిక్ష అనుభవించిన రేవంత్‌రెడ్డి కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ హయాంలో నల్లగొండ జిల్లా ప్లోరైడ్ భూతానికి ఎంతో మంది బలయ్యారని సీఏం కేసీఆర్ పాలనలో ప్లోరైడ్ రహిత జిల్లాగా కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చిందన్న విషయాన్ని ప్రతిపక్షాలు మరువద్దన్నారు.

కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ చైర్‌పర్సన్ వెంపటి పార్వతమ్మశంకరయ్య, మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, బీఅర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News